05-12-2024 12:00:00 AM
మధ్యతరగతి, పేద ప్రజలకు సినిమా అనేది ఒక ఆటవిడుపు. వినోదం కోసం ప్రజలు కుటుంబ సమేతంగా సినిమాలను ఆశ్రయిస్తారు. అటువంటి తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని ఖరీదైన సినిమాల ప్రదర్శనల కోసం ఇష్టానుసారంగా టికెట్ల ధర లు పెంచడం దారుణం. దానికి ప్రభుత్వమూ అనుమతి ఇవ్వడం మరీ విడ్డూరం. థియేటర్లలో సామాన్యులు టికెట్స్ కొని చూడలేని పరిస్థితులు నేడు తెలంగాణలో కనిపిస్తున్నాయి.
టిక్కెట్టు, పార్కింగ్, తినుబండారాలతో సినిమా ఖర్చులన్నీ కలిపి వెయ్యి రూపాయలుపైనే అవుతుంది. ఇలా టికెట్ల ధరలను పెంచే బదులు హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా? లేదా సినిమా బడ్జెట్ తగ్గించుకోవాలి. ఆ భారాన్ని ప్రేక్షకుడి మీద మోపడం సరికాదు.
- శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్