మల్లన్నతోనే నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం
26-05-2024 02:28 AM
జనగామ, మే 25(విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిస్తే నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని తన క్యాంపు ఆఫీసులో జరిగిన సమావేశంలో కడియం ఈ మేరకు వెల్లడించారు. త్వరలోనే తెలంగాణలో జాబ్ క్యాలెండర్‌ను సీఎం రేవంత్ ప్రకటించనున్నట్లు తెలిపారు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం యువతకు చేసిందేమీ లేదన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ, విశ్వవిద్యాలయాలను కేంద్రం తెలంగాణ ఇవ్వలేకపోయిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు తో రాజకీయాలు చేసిన బీఆర్‌ఎస్‌ను అదే ప్రాజెక్టు ముంచిందని అన్నారు. పట్టభద్రు లు వివేకంతో ఆలోచించి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు.






