20 April, 2026 | 8:01 AM

ఆరువేల వీసాల రద్దు

20-08-2025 01:59 AM

ట్రంప్ నిర్ణయంతో విదేశీ విద్యార్థుల ఆందోళన

వాషింగ్‌టన్, ఆగస్టు18: అమెరికాలోని విదేశీ విద్యార్థుల కన్న కలలు కల్ల అవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వారి ఆశలు అడియాశలవుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలతో అమెరికాలో ఉంటున్న ఆవిద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన అంతర్జాతీయ విద్యార్థులపై మరో సారి  ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిం ది. దాదాపు ఆరువేల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసింది.

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక ట్రంప్ దేశంలో ఉన్నత వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించే పనిలో పడ్డారు. ప్రధాన యూ నివర్సిటీలను లక్ష్యంగా చేసుకొని ముఖ్యమైన పాలసీల మార్పులు చేపట్టారు. ఇటు వంటి చర్యలు అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తొలు త జనవరిలో యాంటీసెమిటిజమ్‌ను(యూదులపై వ్యతిరేకత) అరికట్టేలా బిల్లును పాస్ చేశారు.

ఈ బిల్లుతో అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపడితే ఈ ఆదేశాల ప్రకారం వారిని దేశ బహిష్కరణ చేయొచ్చు. అలాగే విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్ నిలిపి వేస్తూ జూన్‌లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం సోషల్ మీడియా వెట్టింగ్‌ను కఠినతరం చేశారు. అలాగే ము ఖ్య విశ్వవిద్యాలయాల్ల పరిశోధనలకు కేటాయించిన నిధుల్లో కోత విధించారు. 

ఇప్పుడేమో అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై ట్రంప్ ప్రభు త్వం కఠిన చర్యలు తీసుకుంది. తాజాగా ఆ రు వేల మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్టులో పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ తెలిపినట్లు పేర్కొంది. నాలుగు వేల మంది దేశ చట్టాలు ఉల్లంఘించడం, దాడులు, మత్తులో డ్రైవింగ్, దోపిడీలకు పాల్పడటం వంటివి చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా చట్టాల్లోని ఐఎన్‌ఏ 3బీ కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. కొత్త విద్యా సంవత్సర ప్రారంభంలో ఈ వీసాల రద్దు వెలుగులోకి రావడంతో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా గతే డాది గణాంకాల ప్రకారం దాదాపు 10 లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థు లు అమెరికాలో చదువుతున్నారు. వారి నుంచి దాదాపు 43.8 బిలియన్ డాలర్లు అమెరికాకు లభించినట్లు ఎన్‌ఏఎఫ్‌ఎస్‌ఏ అసోసియేషన్ పేర్కొంది.