20-08-2025 01:57:23 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 19: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ప్రధానమంత్రి, ముఖ్యమంతులు, మంత్రుల అరెస్టుకు, వారిని అరెస్టుకు, అవసరమైతే బర్తరఫ్‌కు వీలుగా చట్టం చసేం దుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో 130వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలి త ప్రాంతాల ప్రభుత్వ సవరణ, జమ్మూకశ్మీర్ పునఃవ్యవస్థీకరణ బిల్లులు ప్రవేశ పెట్టనున్నది. బిల్లులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ బిల్లులను పార్లమెంట్ ఉమ్మడి కమిటీకి రిఫర్ చేసే తీర్మానాన్ని ప్రవేశపెడతారని తెలిసింది.
గతంలో అర్వింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరె న్ ఢిల్లీ, జార్ఖండ్ సీఎంలుగా ఉన్నప్పుడు వారిపై అనేక నేరారోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరూ కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఇలాంటి కేసుల్లో సత్వర చర్యలకు కేంద్రం పూనుకుంటున్నది. కేంద్రప్రభుత్వ ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలతో దేశంలోని ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీఎంలు, మంత్రులపై చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.
జమ్ముకశ్మీర్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లులకు సభలో సాధారణ మెజార్టీ సరిపోతుంది. అవి ఆమోదం పొందితే, సీఎంలు, మంత్రుల నేరారోపణలు రుజువు కానవసరం లేదు. వారిపై ఆరోపణలు వచ్చినా, చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి వస్తుంది.ఈ బిల్లులు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.