క్యాన్సర్‌పై అవగాహన పోస్టర్ రిలీజ్
హనీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 3న నిర్వహణ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాం తి): ఫ్యాషన్ మాధ్యమంగా క్యాన్సర్‌పై ప్రతీఒక్కరికి అవగాహన కల్పించడమే లక్ష్యమని హనీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోవర్థని కొడవలి అన్నారు. మే 3వ తేదీన ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో హనీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన, మహిళా సాధికారత, సామాజిక అవగాహన నిర్వహించ నుందని తెలిపారు.
ఆదివారం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోవర్ధని కొడవలి, న్యాయవాది, విద్యావేత్త డాక్టర్ నీలిమా ఆర్య, నటి, గామి ఫేమ్ శాంతి రావు ఈ ఫెస్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సామాజిక మార్పును ప్రోత్సహించడానికి ఫ్యాషన్ ను ఒక మాధ్యమంగా ఈ ఫెస్ట్ ఉపయోగిస్తుందని తెలిపారు. దీని ద్వారా గ్లామర్‌కు కొత్త నిర్వచనం ఇస్తుందన్నారు. ఈ ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్టో ఫ్యాషన్ ప్రదర్శనలతోపాటు మాదకద్రవ్యాల వినియోగ నివారణ, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై అవగాహన వంటి కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన ఇచ్చే స్కిట్లు ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. వివిధ రం గాల్లో మహిళలు సాధించిన అద్భుతవిజయాలను కీర్తిస్తూ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డ్స్ ఈ షోలో ఆకర్షణగా పేర్కొన్నారు.






