calender_icon.png 9 November, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్

09-11-2025 12:00:00 AM

పోస్టర్ ఆవిష్కరించిన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, నవంబర్ 8 : స్కూల్ స్థాయి చిన్నారుల్లో క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న తెలంగాణ ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేది కగా నవంబర్ 17, 18, 19 తేదీల్లో  ఈ పోటీ లు జరగనున్నాయి. తాజాగా దీనికి సం బంధించిన  పోస్టర్‌ను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు.

తమ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, పాఠశాల స్థాయిలో చిన్నారులను ప్రోత్సహించేందుకు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాల కు అండగా ఉంటామని మహేశ్ గౌడ్ చెప్పా రు. ఈ పోటీలను నిర్వహిస్తున్న కుంచెట్టి ఖేల్ క్షేత్ర సంస్థ డైరెక్టర్ భవాని ప్రసాద్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రెసి డెంట్ బాబూ రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం మాజీ కోశాధికారి మహేశ్వర్, సెవెన్‌హెచ్ స్పోర్ట్స్ డైరెక్టర్ వెంకటేశ్ పాల్గొన్నారు.