13 April, 2026 | 5:49 PM

బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా..

13-12-2025 12:00 AM

జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రచారం

నిజామాబాద్, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో జరగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కుండ్లచారి బిజెపి మద్దతు పలికిన అభ్యర్థుల తరఫున నిజామాబాద్ రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కార్యక్రమం నిర్వహించారు.   

ఈ సందర్భంగాఎమ్మెల్యే గారు మాట్లాడుతూ. గ్రామ అభివృద్ధి అంటే కేవలం పనులు ప్రారంభించడం మాత్రమే కాదు, ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వాటిని సమయానికి అమలు చేయడం ముఖ్యమైన చర్య అని తెలిపారు. సర్పంచ్గా ప్రజలతో అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధి పట్ల అంకితభావంతో పనిచేసే నాయకత్వం అవసరమని భారతీయ జనతా పార్టీ బలపరిచిన మా అభ్యర్థులు ఇదే నిబద్ధతతో ముందు ఎన్నికలు నిలబడ్డారని వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వేదికలు, రేషన్ బియ్యం, స్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, శుద్ధి నీరు, రహదారులు, వెలుగులు, పరిశుభ్రత మొదలగు సంక్షేమ పథకాల పారదర్శక అమలు వంటి అంశాల్లో మా అభ్యర్థులు చక్కటి మార్పు తీసుకురాగలరు.

గ్రామ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్న ఈ సమయంలో మా అభ్యర్థులను గెలిపించి గ్రామాలను ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాను అని తెలిపారు.ప్రచార కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, బిజెపి నాయకులు  ఇల్లేందుల ప్రభాకర్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ, బిజెపి కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.