calender_icon.png 23 December, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్సీ నియామకల్లో భాగంగా మెదక్ జిల్లా నుండి 272 అభ్యర్థులు

09-10-2024 03:45:53 PM

మెదక్: బుధవారం మెదక్ స్థానిక బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో డీఎస్సీలో ఎంపికైన 272 అభ్యర్థులను టిఎస్ఆర్టిసి బస్సుల ద్వారా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంకి తరలించే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ జెండాతో ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి  ఈరోజు అందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు ఇందులో భాగంగా మెదక్ జిల్లా నుంచి అన్ని విభాగాల్లో ఎంపికైన 272 మంది అభ్యర్థులు 6 బస్సులలో మెదక్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుండి బయలుదేరి వెళ్లడం జరిగిందన్నారు. ప్రతి బస్సులో ఇద్దరు MEO ను లైజన్ ఆఫీసర్స్ గా నియమించామని, వీరితో పాటు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి  ఒక హెల్త్ అసిస్టెంట్, మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారన్నారు. వీరందరికి జిల్లా కలెక్టర్ నర్సాపూర్ లో భోజన వసతి ఏర్పాటు చేసారని అని మెదక్ జిల్లా విద్యాధికారి శ్రీ రాధా కిషన్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.