14 March, 2026 | 8:23 PM

ఇచ్చిన హామీ అమలు చేసిన కౌన్సిలర్

14-03-2026 07:02 PM

వివాహ కానుకగా రూ.15116 అందజేసిన దేశపాక లతారాజేష్

చిట్యాల,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలలో ఇచ్చిన హామీ అమలు చేస్తూ, ఆడపడుచు  వివాహ కానుకగా రూ.15116లను కౌన్సిలర్ దేశపాక లతారాజేష్ శనివారం అందజేశారు. ఇటీవల జరిగిన చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఏడవ వార్డులోని ఆడపడుచుల వివాహము జరిగినట్లయితే పెళ్లి కానుకగా 15116/- ఇస్తానని వార్డ్ కౌన్సిలర్ దేశపాకలతా రాజేష్ హామీఇచ్చారు.

ఇచ్చిన హామీ ప్రకారం శనివారం 7 వార్డుకి చెందిన బోల్గురి యాదయ్య-ముత్యాలమ్మ కుమార్తె  వివాహానికి హాజరై రూ 15116/- ఆడపడుచు కానుకగా అందజేసీ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, పోకల సామ్యూల్, పోకల అశోక్, ఏసురత్నం, సుందర్, యాదయ్య, నాగరాజు, సుధాకర్, వార్డు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.