06-02-2026 12:29:10 AM
కంటోన్మెంట్, ఫిబ్రవరి 5(విజయ క్రాంతి): మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం కంటోన్మెంట్లో చేపట్టిన కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అలక వహించారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముస్లీం మహిళలకు కుట్టు మిషన్లపంపిణీ కార్యక్రమాన్ని గురువారం కంటోన్మెంట్ లీ ప్యాలేస్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంటోన్మెంట్‌ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వారు పంపిణీ చేస్తున్న మిషన్లు అన్నంటిపి ఒక క్రమ పద్దతిలో ఏర్పాటు చేయడం, లేదా వాటిని పూర్తి స్థాయిలో ఫిట్టింగ్ చేసి అందజేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా అధికారులు వాటిని విడివిడి భాగాలుగా వారికి అందజేశారు. అయితే వాటిని క్రమపద్దతిలో ఏర్పాటు చేయకుండా ఇలా గజిబిజిగా, విడివిడి భాగాలుగా ఇవ్వడంపై అధికారులను నిలదీశారు.
దీనిపై అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే , కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ తో కలిసి ఇద్దరు, ముగ్గురు మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి కార్యక్రమం నుంచి బయటకు వచ్చేశారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, ఇలియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.