calender_icon.png 7 June, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై కారులో మంటలు

06-06-2025 06:15:55 PM

తృటిలో తప్పిన ప్రాణ నష్టం

శేరిలింగంపల్లి: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి(Madhapur Cable Bridge)పై అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. కేబుల్ బ్రిడ్జి మధ్యలో గచ్చిబౌలి నుండి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45(Jubilee Hills Road No. 45) వచ్చే దారి లో AP 09CA1878 నెంబర్ గల కారులో ఒక్కసారిగా మంటలు  చెలరేగాయి. కారు ముందు భాగంలో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి కారుమొత్తం వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో కేబుల్ బ్రిడ్జి9Cable Bridge)పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇది గమనించి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వెంటనే బయటికి దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కేబుల్ బ్రిడ్జిపై జరగడంతో వాహనాల రాకపోకలు బారి అంతరాయం ఏర్పడింది. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సమాచారం అందుకున్న మాదాపూర్  పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.