24 June, 2026 | 4:33 PM

ఉట్నూరులో రాణి దుర్గావతి వర్ధంతి

24-06-2026 03:15 PM

ఉట్నూర్,జూన్ 24(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలో  రాణి దుర్గావతి వర్ధంతిని నిర్వహించారు. రాజ్ గోండు సేవ సమితి రాష్ట్ర కార్యాలయం లో గుస్సాడి గుట్ట ఉట్నూర్ లో రాణి దుర్గావతి వర్ధంతి సందర్భంగా రాణి దుర్గావతి చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ గోండు సేవా సమితి   రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషం రావ్ మాట్లాడుతూ.. రాణి దుర్గావతి (1524–1564) గోండ్వానా రాజ్యానికి చెందిన గొప్ప వీరనారి, పరిపాలకురాలు. ఆమె ధైర్యం, సాహసం, ప్రజాపాలన, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ గోండు సేవ సమితి జిల్లా ఉపాధ్యక్షుడుఆడ భీం రావు, ఉట్నూర్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం ప్రకాష్, ఆత్రం వెంకట్ రావు పాల్గొన్నారు