24 June, 2026 | 4:32 PM

ఇంద్రవెల్లి ఎంపీడీవోగా మహేందర్

24-06-2026 03:17 PM

ఉట్నూర్, జూన్ 24(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా  మహేందర్ బుధవారం  పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని సోనాల మండల ఇన్చార్జి ఎంపీడీవో గా  విధులు నిర్వహిస్తున్న మహేందర్ కు  ఇటీవల ఎంపీడీవో గా  పదోన్నతి వచ్చింది. పదోన్నతి పొందిన   మహేందర్ ను  ఇంద్రవెల్లి ఎంపీడీవో గా  జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఉత్తర్వులు జారీ చేయడంతో  పదవి బాధ్యతలు చేపట్టారు. నూతన ఎంపీడీవో గా  బాధ్యతలు చేపట్టిన మహేందర్ ను  ఇన్చార్జి ఇఓపిఆర్డి  సంజీవరావుతోపాటు  కార్యదర్శులు, రాజకీయ నాయకులు సన్మానించారు.