24 June, 2026 | 4:31 PM

గాడిలో పడేనా...?

24-06-2026 03:12 PM
  1. -ప్రైవేటు చదువుల దోపిడీపై వేటు ఎప్పుడో..?
  2. -ఇంచార్జీల పాలనలో విద్యాశాఖ....
  3. -సెలవుల్లో డీఈవో... -ప్రైవేట్ పాఠశాలల్లోనే పుస్తకాల విక్రయం సబబేనా..
  4. -ప్రమోషన్స్ కు అడ్డంకిగా సర్వీస్ రూల్స్..

ఖమ్మం ఎడ్యుకేషన్, (విజయక్రాంతి): ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి జిల్లా విద్యాశాఖ వేటు వేస్తుందా లేక ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ ముఖ్యులతో చేతులు కలిపి మామూలుగా తీసుకుంటుందా అనే ప్రశ్నలు విద్యార్థుల తల్లిదండ్రులలో ఉత్పన్నమవుతున్నాయి.. అరకొర వసుధలకు వసతులతో రాజకీయ ప్రోద్బలంతో ఖమ్మం నియోజకవర్గ మంత్రి, మంత్రి తనయుడు తమకు బాగా తెలుసునని అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి... బండెడు పుస్తకాలతో బారేడు ఫీజులతో పిల్లల తల్లిదండ్రులు గత మూడు నెలల నుంచి తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేటు విద్య కు... రూపాయి రూపాయి కూడ బెట్టి... ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్పిన ఫీజులకు తిని తినక పస్తులు ఉండి..తమ చిన్నారుల భవిష్యత్తు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు అనేక వ్యయ ప్రయాసాల కోర్చుతూ...

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం అయిన నేపథ్యంలో తమ చిన్నారుల స్కూల్ బ్యాగులు, యూనిఫామ్, పాదరక్షలు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు... కొనుగోళ్లలో నిమగ్నమై సోమవారం పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటికీ నేటి వరకు కూడా చిన్నారుల తల్లిదండ్రులు తమ వ్యక్తిగత పనులు మానుకొని సైతం పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ విద్యాసంస్థల వైపు పరుగులు తీస్తున్నారు..

-ఫీజుల మోత...

మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను కాన్వెంట్ స్కూళ్లలో చదివించుకోవాలంటే ప్రైవేటు విద్యా సంస్థలు నిర్ణయించిన ఫీజులు చూస్తుంటే తల్లిదండ్రుల మస్తిష్కానికి బిమారి వచ్చిందా అనే విధంగా ఫీజుల ధరల పట్టిక ఉందని చెప్పవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను ఏర్పాటు చేయకుండా ప్రైవేటు విద్యాసంస్థలు వారి అసోసియేషన్ల ఆదేశాల మేరకు సగటు చిన్నారి తల్లిదండ్రుల ఆర్థిక వ్యవస్థ నడ్డి ని విరుస్తున్నారు అని చిన్నారుల తల్లిదండ్రులు ప్రజలు వాపోతున్నారు 

-సెలవుల్లో డీఈవో..

జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోగ్య సమస్యలకు చెందిన శాశ్వత సెలవులో ఉండడంతో ఇన్చార్జి నీవుగా ఇన్చార్జిల పాలన కొనసాగుతుండడంతో విద్యా వ్యవస్థ సక్రమమైన మార్గంలో  పయనిస్తుందా  అంటే అనేక సందేహాలకు తావిస్తోందని చెప్పవచ్చు.. వేరే జిల్లాకు చెందిన డీఈవోలు ఈ జిల్లాలో విధులు  నిర్వహించేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. 

ప్రైవేట్ పాఠశాలల్లోనే పుస్తకాల విక్రయం సబబేనా..

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాల లోనే విద్యార్థుల తరగతులకు చెందిన పాఠ్యపుస్తకాలను నోట్ పుస్తకాలను బహిరంగంగానే విక్రయిస్తున్నారు.. ఇంత తెలిసినా కూడా సంబంధిత విద్యాశాఖ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఈ తతంగాన్ని మామూలుగా తీసుకుంటున్నారు.

-ప్రమోషన్స్ కు అడ్డంకిగా సర్వీస్ రూల్స్..

విద్యాశాఖలో ప్రమోషన్లకు సర్వీస్ రూల్స్ అడ్డంకిగా మారాయి.. విద్యాశాఖలో 1998 నుంచి సర్వీస్ రూల్స్ వివాదం  కొనసాగడం పదోన్నతులకు సర్వీస్ రూల్స్ అడ్డంకిగా మారాయి..