2 June, 2026 | 2:14 AM

అప్పన్నపేట శివారులో పల్టీ కొట్టిన కారు

01-06-2026 07:40 PM

తప్పిన పెను ప్రమాదం

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామ సమీపంలో ఒక కారు పల్టీ కొట్టింది.. కానీ ప్రమాదం తప్పింది. గరిడేపల్లి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కీసరి నాగేశ్వరరావు అనే వ్యక్తి హుజూర్నగర్ నుంచి గరిడేపల్లి వైపు తన సొంత కారులో వస్తున్నాడు. అప్పన్నపేట సమీపంలోకి రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొని చిన్న కాలువలోకి పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. డ్రైవింగ్ చేస్తున్న నాగేశ్వరావుకి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. కారు పల్టీ కొట్టిన తీరు ప్రమాద తీవ్రతను తెలిపే విధంగా ఉంది. సంఘటన జరిగిన వెంటనే గరిడేపల్లి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్వల్ప గాయాల పాలైన నాగేశ్వరావును 108 వాహనంలో హుజూర్నగర్ ఆసుపత్రికి తరలించారు.