2 June, 2026 | 2:14 AM

అటవీశాఖ వారోత్సవాలు ప్రారంభం

01-06-2026 07:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలులో భాగంగా అటవీశాఖ వారోత్సవాలను జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ సుఖదేవ్  ప్రారంభించారు.  జూన్ ఒకటవ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్మల్ జిల్లాలోని అన్ని అటవీ రేంజ్ పరిధిలో బైక్ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, బర్డ్ వాచింగ్,విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీల నిర్వహణ, వన దర్శిని, ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు, కళాజాత కార్యక్రమాలు, బైక్ ర్యాలీ, ప్లాస్టిక్ నివారణ అవగాహన కార్యక్రమాలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి.