18-02-2026 12:37:38 AM
‘మహా’- మెట్రోతో ఒప్పంద పత్రాల మార్పిడి
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థలలో ఒకటైన క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ నాగ్‌పూర్‌లో 350కి పైగా పడకలతో అత్యాధునిక మల్టీ-స్పెషాలిటీ కేర్ హాస్పిటల్ నిర్మాణానికి లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ పొందింది. ఈ లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్‌ను మహా మెట్రో, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ మధ్య, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ సమక్షంలో మార్పిడి చేసుకున్నారు.
నాగ్‌పూర్‌లోని కస్తూర్చంద్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని మహా -మెట్రో భూమిపై ఈ హాస్పిటల్ నిర్మించబడనుంది. సుమారు రూ.600 కోట్ల పెట్టుబడితో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో ఈ వైద్య సంస్థను అభివృద్ధి చేయనున్నారు. దశల వారీగా ప్రారంభమయ్యే ఈ హాస్పిటల్ ద్వారా 1500కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. కార్యక్రమంలో క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా, కేర్ హాస్పిటల్స్ కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ పాల్గొన్నారు.