2 May, 2026 | 7:06 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

కెపిఆర్ఐటిలో కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ప్రారంభం

18-06-2025 08:19 PM

ఘట్ కేసర్: ఘట్ కేసర్ మున్సిపల్ ఘనపూర్ లోని కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Kommuri Pratap Reddy Institute of Technology) ఆధ్వర్యంలో రూపొందిన ఆధునిక కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్(Campus Corporate Connect) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన క్యాంపస్ చైర్మన్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఇండియా క్యాంపస్ హెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జాషువా డేవిడ్ హాజరై ప్రారంభించారు. 

వైస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ లు కొమ్మూరి దివ్య రెడ్డి, ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్, ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనాథ్ కాశ్యప్, వైస్ వైస్ ప్రిన్సిపాల్, అనీష్, డీన్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ కేంద్రం ద్వారా విద్యా పరిశ్రమలతో నేరుగా ఏర్పడే అవకాశాలు, ఉద్యోగ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్ షిప్స్, ప్లేస్మెంట్స్ వంటి అనేక అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇది విద్యార్థుల భవిష్యత్ ను మారుస్తూ కార్పోరేట్ ప్రపంచానికి దగ్గర చేస్తుందని పేర్కొన్నారు.