21 August, 2026 | 9:39 PM

Breaking News

రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •   కోరుట్లలో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన జువ్వాడి బ్రదర్స్   •   గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ   •   సాలూరలో SIR-2026 నోటీస్ జనరేషన్ ప్రక్రియ పరిశీలన   •  

నీ బొమ్మే చెక్కి.. పూజించానే జిక్కి

03-08-2024 12:05 AM

రవితేజ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలై సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణ పొందాయి. తాజాగా మరో రొమాంటిక్ గీతం రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్‌గా విడుదలైన జిక్కీ సాంగ్‌ను మిక్కీ జే మేయర్ హృద్యంగా కంపోజ్ చేశారు. సాంగ్‌లో క్లాసికల్, మోడరన్ టచ్ ఆకట్టుకునేలా ఉంది.

వనమాలి గీత సాహిత్యానికి కార్తీక్, రమ్య బెహరా గాత్రం తోడవటం ప్లస్ పాయింట్ అయింది. వాస్తవికతకు దగ్గరైన సెట్స్, సహజమైన కాశ్మీర్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ సాంగ్‌లో రవితేజ కెమిస్ట్రీ కట్టిపడేస్తోంది. ప్రశంసించకుండా ఉండలేనంతగా బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటోంది. ‘అల్లరిగా అల్లికగా అల్లేసిందే నన్నే అలవోక ఓ లలనా నీ వలన మోగిందమ్మో నాలో థిల్లానా..’ అనే సాకితో ప్రారంభమైన ఈ పాట కవితాత్మకంగా సాగుతోంది. ‘నీ బొమ్మే చెక్కి రోజూ నిన్నే పూజించానే జిక్కి..’ అంటూ ప్రాసానియమంతో అల్లుకున్న పదాలు సంగీతప్రియుల పెదాలపై నాట్యమాడేలా ఉన్నాయి.