calender_icon.png 9 July, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కెరీర్‌లో బెస్ట్ ‘శివంభజే’

03-08-2024 12:05:00 AM

అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవంశీ హీరోహీరోయిన్‌గా అప్సర్ దర్శకత్వంలో గురువారం ప్రేక్షకుల ముందుకువచ్చిన చిత్రం ‘శివంభజే’. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. ‘నేను సినిమా సినిమా చేస్తున్నానంటే కొత్త పాయింట్ ఉంటుందని అంతా అనుకుంటారు.

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇంటర్వెల్, క్లుమైక్స్ సీన్లకు గూస్‌బంప్స్ వస్తున్నాయని చెప్తున్నారు. నా కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుందీ చిత్రం’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అప్సర్, నిర్మాత మహేశ్వర్‌రెడ్డితోపాటు ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది మాట్లాడి ‘శివంభజే’ జర్నీ అనుభవాలను పంచుకున్నారు.