21 August, 2026 | 9:48 PM

Breaking News

ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •  

సాలూరలో SIR-2026 నోటీస్ జనరేషన్ ప్రక్రియ పరిశీలన

21-08-2026 09:17 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ డివిజన్ ఆర్‌డీఓ శుక్రవారం సాలూర మండలంలో సర్-2026 నోటీస్ జనరేషన్ ప్రక్రియను పరిశీలించారు. సాలూర తహసీల్దార్‌తో కలిసి ప్రక్రియ కొనసాగుతున్న తీరును పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సాలూర మండలంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని ఆర్‌డీఓ పరిశీలించారు. సర్వే నంబర్లు 1945లో 25 గుంటలు, 1946లో 5 గుంటలు, 1947లో 36 గుంటలు, 1948లో 14 గుంటలు కలిపి మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని ఆమె సందర్శించారు. నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి స్థల వివరాలు, అందుబాటులో ఉన్న విస్తీర్ణం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.