1 July, 2026 | 3:54 AM

గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

12-05-2026 08:24 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా, నిల్వ, సరఫరా కేసులో నలుగురిపై కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాసరావు తెలిపిన వివరణ ప్రకారం.. పోలీసులు గంజాయి నిర్మూలనతో పాటు నేరాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంలో గంజాయి రవాణా కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులను బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు  పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.

అనంతరం నార్కోటిక్ పరీక్షల నిమిత్తం వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, యూరిన్ టెస్ట్ ద్వారా పరీక్షలు చేయించారు. ఈ టెస్టులో నలుగురు వ్యక్తులకు రిపోర్టు పాజిటివ్‌ గా వచ్చిందీ. నిందితులు ఎస్‌కే జమీర్,ఆర్. ఎమ్‌డీ తాజ్ బాబా,ఎస్‌కే కలీం, తోట మనీదీప్ లపై కేసు నమోదు చేసుకుని  న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ మేరకు కోర్టు నిందితులను  15 రోజుల పాటు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించాలని ఆదేశించిందనీ బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు.