15 August, 2026 | 4:52 PM

భాగ్యనగర్ తండా లో రెపరెపలాడిన మూవెన్నెల జాతీయ జెండా

15-08-2026 04:13 PM

పంచాయితీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన గ్రామ సర్పంచ్ హీరాలాల్.....

కారేపల్లి ఆగస్టు 15 విజయక్రాంతి: భాగ్యనగర్ తండాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్ తండా పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ సెక్రెటరీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బానోత్ హిరాలాల్  జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాల లో హెడ్మాస్టర్ , డిబి సెంటర్ నందు లావుడియా ఈర్యా నాయక్, భాగ్యనగర్ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ గుగులోత్ బీక్కులాల్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు గాంధీ, నాగేష్,కిషన్,గూగులోత్ మోతిలాల్, బానోత్ రామచందర్, రాందాస్, గుగులోత్ భగవాన్ దాస్,గుగులోత్ హర్షనాయక్,రాంబాబు, మంగ్య నాయక్ అంగన్వాడి సిబ్బంది ,పంచాయతీ సిబ్బంది ,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.