15 August, 2026 | 4:52 PM

బెటాలియన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 04:15 PM

హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ ప్రతేక పోలీస్ బెటాలియన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శని వారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండావిష్కరించిన అనంతరం కమాండెంట్ మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను కమాండెంట్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ నిబద్ధతతో సేవలు అందించిన ఉత్తమ సిబ్బందికి ప్రభుత్వం అందించిన సేవా పతకాలను అందజేశారు. 

సేవా పతకాలు అందుకున్న వారు వీరే

విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి కమాండెంట్ వెంకటేశ్వర్లు సేవా పతకాలను అందజేశారు. వీరిలో గంగాధర్ (ఏఆర్ ఎస్ఐ), హెడ్ కానిస్టేబుళ్లు నరసయ్య, జాబ్రీ జాబెర్ చవుష్, అంజద్ ఖాన్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఆంజనేయ రెడ్డి, యూనిట్ మెడికల్ డాక్టర్ సంతోష్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.