16 April, 2026 | 7:21 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 13,048 కేసులు పరిష్కారం

15-06-2025 06:39 PM

80 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ. 17,66,294  తిరిగి అందజేత..

రామగుండం (విజయక్రాంతి): జాతీయ మెగా లోక్ అదాలత్(Lok Adalat) సందర్భంగా రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న (కాంఫౌండబుల్) ఐపీఎస్ కేసులు 536 పరిష్కరించబడ్డాయని రామగుండం సీపీ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా(Ramagundam CP Commissioner Amber Kishore Jha) ఒక ప్రకటనలో తెలిపారు. 

విపత్తు నిర్వహణ కేసులు 1432, పెట్టి కేసులు 56, ఇ-పెట్టీ కేసులు 8568, డ్రంక్ & డ్రైవ్  కేసులు 2456 మొత్తం 13,048 కేసులు పరిష్కరించబడ్డాయని, సైబర్ నేరాలకు సంబందించి 78 కేసులలో బాధితులకు రిఫండ్ మొత్తం రూ. 13,08,684 సీసీ పీఎస్ పోలీస్ స్టేషన్ రామగుండంలో  నమోదైన 2 కేసులలో బాధితులకు తిరిగి రిఫండ్ అయినా మొత్తం - 4,57,610 సైబర్ నేరాలకు సంబంధించి మొత్తం బాధితులకు తిరిగి రిఫండ్ అయినా మొత్తం  రూ.17,66,294/ అందజేయడం చేయడం జరిగిందని, కమీషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత 15 రోజుల నుండి  కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున టార్గెట్ కు మించి కేసులు పరిష్కరించామని, రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులను సిబ్బందిని సీపీ అభినందించారు.

త్వరలో కోర్టు సిబ్బందికి, ప్రతిరోజు మానిటర్ చేసిన అధికారులకు, త్వరలో రివార్డ్స్ అందజేస్తామని తెలిపారు. కమిషనరేట్ లో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన రెండు జోన్ ల ప్రధాన న్యాయమూర్తిలకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యలను పరిరక్షిస్తూ అదేవిధంగా కోర్టు డ్యూటీ విధులను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషిచేసిన అధికారులు, సిబ్బంది తదితరులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.