2 July, 2026 | 10:53 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి వైరా ఆధ్వర్యంలో.. 10వేలు విలువగల సామాన్లు వితరణ

05-04-2025 01:49 PM

 ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందజేత..

వైరా, విజయక్రాంతి: సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి వైరా వారి ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలం వి.వి. పాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లో గర్భిణీ స్త్రీలు ,బాలింతలకు పలు సౌకర్యాలను కల్పించారు.. వారు కూర్చోవడం కోసం కుర్చీలు, ఫ్యాన్, మంచినీళ్ళ క్యాన్, టేబుల్, ర్యాక్ మొదలైన సామాన్లు సుమారు 10 వేల రూపాయల విలువైన వస్తువులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  పాల్గొన్న తల్లాడ ఎంపీడీవో ఏనుగు సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సంస్థ వారు చేపట్టిన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని తెలిపారు భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో సామాజికంగా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మరో అతిధి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్ బాబు మాట్లాడుతూ ఈ సంస్థ వారు చేపట్టిన అన్ని కార్యక్రమాలు అర్హత కలిగిన వారికి చేరువ అవుతున్నాయని వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు యంపీ దాస్, సీడీపీఓ వీరభద్రమ్మ, తల్లాడ ఏపీఓ కోటయ్య, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, అంగన్వాడీ సిబ్బంది, సంస్థ ప్రతినిధులు శోభన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రోత్సాహక నగదు  అందజేత..

పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదును అందజేశారు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల లో ప్రధమ స్థానంలో నిలిచిన సింధు కు  5వేల రూపాయలు,ద్వితీయ స్థానంలో నిలిచిన చైత్ర కు రూ 4వేలు  , తృతీయ స్థానంలో నిలిచిన స్రవంతి కి.3వేలు ప్రోత్సాహక నగదు ను బహుమతులుగా అందజేశారు..