14 August, 2026 | 8:08 PM

Breaking News

నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •   చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి   •  

అయ్యప్ప ఆలయంలో ఘనంగా పంచామృత అభిషేకం

14-08-2026 07:34 PM

గజ్వేల్: శ్రావణమాసం పురస్కరించుకొని  గజ్వేల్ పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్ గురుస్వామి మాట్లాడుతూ... శ్రావణమాసం నెల రోజుల పాటు ప్రతిరోజూ ఇద్దరు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.