17 April, 2026 | 7:24 PM

రోడ్లపైకి పశువులు.. ప్రమాదాల్లో వాహనదారులు

03-05-2025 01:57 AM

హుజూర్‌నగర్, మే 2: గ్రామాల్లో పశువులను, ముఖ్యంగా గేదెలను యజమానులు నిర్లక్ష్యంగా రోడ్డుమీదకు వదలడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇటువంటి పశువుల కారణంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోమొబైల్ ప్రయాణికులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలు పెరుగుతున్నాయు.రోడ్లపై గేదెలు సంచరించడం వల్ల రాత్రిపూట ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇలాంటి నిర్లక్ష్యంపై  కఠినంగా వ్యవహరిస్తాం. పశువులను రోడ్లపై వదిలిపెట్టిన యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవు.పశువులను కట్టే సౌకర్యాలు కల్పించడం, వాటి సంచారంపై గ్రామ పంచాయితీలు సమన్వయం గా పని చేయడం అవసరం. ఈ సమస్యను నియంత్రించేందుకు ప్రతి గ్రామ పంచాయితీ కార్యదర్శి చొరవ తీసుకోవాలని. గ్రామస్తులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.పశువుల సంచారంపై గమనిక పెట్టాలి.

పౌరుల సహకారం లేకుండా సమస్యను పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ పశువులను నియంత్రణలో ఉంచాలన్న బాధ్యతను స్వీకరించాలి.గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్లు,ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజలు ఈ సూచనలను పాటించకపోతే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తప్పవని హుజూర్ నగర్ సీఐ జి చరమంద రాజు తెలిపారు.