రాబోయే మూడు రోజులు ఎండలే
03-05-2025 01:57 AM
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండబోవని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 7వ తేదీ వరకు జీహెచ్‌ఎం సీ పరిధిలోనూ రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలుంటాయని తెలిపింది. శుక్రవారం నిజామాబాద్ జిల్లా మోస్రాలో అత్యధికంగా 43.9 డిగ్రీలు, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో అత్యల్పంగా 40 డిగ్రీలు నమోదైంది.






