లంచం కేసులో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్
భువనేశ్వర్: లంచం కేసులో ఒడిశాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. భువనేశ్వర్‌కు చెందిన మైనింగ్ వ్యాపారి నుంచి రూ. 20 లక్షల రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై భువనేశ్వర్‌లో రఘువంశీని అరెస్టు చేశారు.
ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (Indian Revenue Services) కు చెందిన ఆ అధికారి, భువనేశ్వర్‌కు చెందిన గని ఆపరేటర్‌తో రూ.50 లక్షల మనీలాండరింగ్ కేసు(Money laundering case) నుండి ఆ వ్యక్తి పేరును తొలగించడానికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. రఘువంశీ రూ.20 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భువనేశ్వర్‌కు చెందిన మైనింగ్ వ్యాపారి నుంచి లంచం తీసుకోబోతున్నట్లు సమాచారం అందడంతో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ట్రాప్ ఆపరేషన్ నిర్వహించిందని అధికారులు తెలిపారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి రఘువంశీని ఈ ఆపరేషన్ సమయంలో పట్టుకున్నట్లు, తరువాత ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.




