గర్రెపల్లి మోడల్ స్కూల్ లో మాక్ ఎలక్షన్స్
11-07-2026 09:49 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్లో శనివారం నమూనా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులలో భారత ఎన్నికల విధానం పట్ల అవగాహన కల్పించడానికి, విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ కోసం విద్యార్థి నాయకులను ఎన్నుకోవడం జరిగింది.






