11 July, 2026 | 10:52 PM

మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక

11-07-2026 09:39 PM

ఖమ్మం,(విజయక్రాంతి): త్రీ టౌన్ గుట్టల బజార్ లోని మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్  వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాఠశాల విద్యార్థి నాయకులకు , వివిధ సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, ఇతర బాధ్యతలు స్వీకరించే విద్యార్థులకు, ఒక నిర్దిష్ట హోదా, గుర్తింపు బ్యాడ్జీలు ప్రధానం చేశారు. ముఖ్య అతిథిగా బ్రదర్ సంతోష్ కుమార్ (ప్రిన్సిపాల్, సెయింట్ థెరీసా హై స్కూల్, రామకృష్ణ పురం) హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ కొత్త పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

ఇన్వెస్టిచర్ వేడుకలో విద్యార్థి నాయకులు తమ బ్యాడ్జ్‌లను ధరించి , పాఠశాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ  చేశారు . పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రదర్ జాన్ పాల్ మాట్లాడుతూ ఈ వేడుక విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి మరియు పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతుంది . విద్యార్థులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని , చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొనాలని కోరారు . ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధ్యాయుని , ఉపాధ్యాయులు , విద్యార్థిని , విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు .