11 July, 2026 | 10:37 PM

జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

11-07-2026 09:29 PM

- జర్నలిస్టు ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో అభినందన సభ

రామచంద్రపురం: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా నూతన కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులకు రామచంద్రపురంలోని బాలాజీ గార్డెన్స్ లో శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టు ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్దుల్ బాసిత్ హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా జనరల్ సెక్రటరీ అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా జనరల్ సెక్రటరీ భశ్వేశ్వర్, జిల్లా సంయుక్త కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఈసీ సభ్యుడు మజీద్ అలీలను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. ప్రతి జర్నలిస్టుకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సభ్యుల సహకారంతో సంగారెడ్డి జిల్లా కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శ కమిటీగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని పేర్కొన్నారు.సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభాకర్ యాదవ్‌కు, ముఖ్య అతిథిగా హాజరైన అబ్దుల్ బాసిత్‌కు, కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు, సంఘ సభ్యులందరికీ సన్మానితులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.