ఆవుపై చిరుత దాడి
11-07-2026 09:26 PM
కుబీర్,(విజయక్రాంతి): మండలంలోని డో డర్ను శివారు ప్రాంతంలో చిరుత ఆవు పై దాడి చేసి పంపి వేసినట్టు రైతు జాదవు ఉత్తం తెలిపారు. శుక్రవారం మేతమేయడానికి వెళ్ళిన ఆవు ఇంటికి రాకపోవడంతో సమీప ప్రాంతాల్లో వెతకగా చనిపోయినట్లు గుర్తించారు. చిరుత పులి గాయాలు ఉండడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.






