7 August, 2026 | 2:00 PM

బీఆర్‌ఎస్ నేతలపై సిబీఐ విచారణ ఆపాలి

03-09-2025 12:00 AM

రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 2: బిఆర్‌ఎస్ నేతలపై సిబిఐ విచారణ ఆపాలనీ రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మంగళ వారం బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యా లయం నుంచి నాగార్జున సాగర్ హైవే పై భారీ ర్యాలీ తో బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నేతలపై సిబిఐ విచారణ తక్షణమే ఆపాలనీ అన్నారు. అదేవిధంగా సిబిఐ అంటే (సి)కాంగ్రెస్, (బి) బిజెపి, (ఐ) ఇన్వెట్టిగెషన్ అంటూ ఎద్దేవా చేశారు. అనంతరం బిఆర్‌ఎస్ శ్రేణులు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దింతో సాగర్ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, రాష్ట్ర నాయకులు బూడిద రాంరెడ్డి, బిందు రంగారెడ్డి, జెర్కొని రాజు, మాజీ ఎంపీపీ కృపేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంబాలపల్లి భరత్ కుమార్, వివిధ మండల అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.