భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
గజ్వేల్, ములుగు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ హైమావతి
గజ్వేల్, సెప్టెంబర్ 2 : భూభారతి దరఖాస్తులను పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి వర్గల్ మండల తాసిల్దార్ రఘువీర్ రెడ్డిని ఆదేశించారు. గజ్వేల్, వర్గల్ పర్యటనలో భాగంగా వర్గల్ తహసిల్దార్ కార్యాలయాన్నీ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను భూ భారతి చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం డిస్పోజల్ ప్రక్రియ వేగవంతం చెయ్యాలని తహసిల్దార్ రఘువీర్ రెడ్డిని ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నిర్దిష్ట సమయంలో జారీ చేయాలన్నారు. మీనాజీపేటలో ఇందిరమ్మ లబ్ధిదారులకు పే-మెంట్‌లో పెండింగ్ వస్తె ఈ- కేవైసీ చేయించుకోవాలని, ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఎదురైతే కలెక్టరేట్లోని గృహనిర్మాణ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు.






