ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా
వలిగొండ,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం పెట్టిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు కొండే నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఇప్పుడు నువ్వు వేతనాలు చెల్లించాలని వేతనాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ... మల్టీ పర్పస్ విధానం వల్ల కార్మికుల శ్రమదోడికి గురవుతున్నారని, ప్రభుత్వం ఇచ్చే వేతనం సకాలంలో ఇవ్వకుండా, కార్మికులు పస్తులు ఉండాల్సి వస్తుందని అన్నారు. గ్రామాల్లో ఉన్న కార్మికులు ఆన్లైన్ల పేర్లు నమోదు కాని వారు మండల వ్యాప్తంగా 40 మంది ఉన్నారని వారికి వేతనాలు రాక ఏడు నెలలు గడుస్తుందని వారికి ఇచ్చే వేతనం 3,000నుండి 5,000 వరకు ఉంటుంది. వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముల్టీపర్పస్ రద్దుచేసి జీవో ప్రకారం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.






