29-07-2025 02:18:55 AM
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, సోమవారం విచారణ చేపట్టిన ఉన్నత ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హెచ్‌సీఏ బాధ్యతలను బీసీసీఐకి అప్పగించేలా ఆదేశాలివ్వాలని సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ తన పిటిషన్‌లో పేర్కొంది.
ఈనెల 19న నిర్వహించిన వార్షిక సమావేశం చెల్లదని ప్రకటించాలని సైతం అభ్యర్థించారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ బాధ్యతలు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావుకు అప్పగిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరో మూడు వారాల పాటు పొడిగించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాల విషయంలో జస్టిస్ నవీన్‌రావు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశాలిచ్చింది.