calender_icon.png 29 July, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

29-07-2025 02:16:57 AM

  1. గ్లెనిగల్స్ హాస్పిటల్ డాక్టర్ కావ్య సూచన
  2. లక్డీకపూల్‌లో అవగాహన వాక్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): శరీరంలో లివర్ అతిపెద్ద పవర్ హౌస్ -రీ జనరేటివ్ ఆర్గాన్ అని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని గ్లెనిగల్స్ హాస్పిటల్ డాక్టర్ కావ్య అన్నారు. సోమవారం లకిడికపూల్‌లోని గ్లెనిగల్స్ హాస్పిటల్  ఆధ్వర్యంలో లివర్ జబ్బులపై అవగాహన వాక్ నిర్వహించారు. వాక్‌ను సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్, గ్లెనిగల్స్ హాస్పిటల్ లీడ్ ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి ఆధ్వర్యంలో ప్రారంభించారు.

గ్లెనిగల్స్ హాస్పిటల్, లక్డీకాపూల్ నుంచి రెండు కిలోమీటర్ల మేర అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసిపి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. లివర్ సంబంధ వ్యాధుల శాస్త్ర చికిత్సలో గ్లెనిగల్స్ హాస్పిటల్‌కు ఎంతో చరిత్ర ఉందన్నారు. గ్లెనిగల్స్ హాస్పిటల్ లీడ్ ట్రాన్స్ ప్లాంట్ హెపటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి మాట్లాడుతూ..

హెపటైటిస్ ఏ ఈ వైరస్ లు కలుషిత నీరు ఆహారం వల్ల వస్తాయని, వీటి వల్ల శాశ్వత లివర్ డ్యామేజీ ఉండదన్నారు. చాలా తక్కువ మందిలో లివర్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది అన్నారు. హెపటైటిస్ బి - సి వైరస్ ల వల్ల శాశ్వత లివర్ డ్యామేజీ, లివర్ క్యాన్సర్లకు దారితీస్తుందని, మన దేశంలో 40 మిలియన్ల మంది హెపటైటిస్ బి తో బాధపడుతున్నారని అయితే ఈ వైరస్ బారిన పడినట్లు వారికే తెలియని పరిస్థితి ఉందన్నారు.

లివర్ ను దెబ్బతీస్తున్న వైరస్ ల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు హెపటైటిస్ ఫ్రీ ఇండియా గా మార్చాలని లక్ష్యంతోనే అవగాహన వాక్కు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మెడికేషన్స్ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల లివర్ సంబంధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ కావ్య తెలిపారు.

ఈ అవగాహన వాక్ లో గ్లెనిగల్స్  హాస్పిటల్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్లో డాక్టర్ తరుణ్ గట్టు, డాక్టర్ డి మణికంఠేశ్వర రావు, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనస్తటిస్ట్ డాక్టర్ ఎం గణేష్ చౌహన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సమీర్ కుమార్ పాల్గొన్నారు.