calender_icon.png 29 July, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు జడ్జిని కలిసిన ఉద్యోగులు

29-07-2025 02:20:05 AM

బాధ్యతలు చేపట్టినందున శుభాకాంక్షలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): రాష్ట్ర హైకోర్టు శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ జస్టిస్ ఆప్రేష్ కుమార్ సింగ్‌ను సోమవారం ఆయన ఛాంబర్‌లో న్యాయశాఖ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వారి సమస్యలు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.

న్యాయశాఖ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర బిల్లులను మంజూరు గురించి వివరించారు. జడ్జిని కలిసిన వారిలో అఖిలభారత అధ్యక్షుడు బోధ లక్ష్మారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. కోటిశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సహాయక కార్యదర్శి కోడుమూరు నల్లారెడ్డి, సిటీ సివిల్ కోర్టు ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, రాష్ట్ర మహిళా ప్రతినిధి వంశీలత, నరేష్, రాకేష్ ఉన్నారు.