2 July, 2026 | 5:08 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •  

సీబీఎస్‌ఈ పరీక్షల తేదీలు ఖరారు

22-11-2024 12:33 AM

ఫిబ్రవరి 15 నుంచి షురూ

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను సీబీఎస్‌ఈ 10, 12వ తరగతులకు సంబంధించిన బోర్టు పరీక్షల తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గురువారం ప్రకటించింది. 2025 ఫిబ్రవరి 15 నుంచి పది, 12వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. షెడ్యూల్ ప్రకా రం మార్చి 18వరకు పదోతరగతి, ఏప్రిల్ 4వరకు 12వ తరగతి పరీక్షలు కొనసాగుతాయి.

ఈ మేరకు సీబీఎస్‌ఈ బోర్డు డేట్‌షీట్‌ను విడుదల చేసింది. కాగా పరీక్షలకు 86 రోజుల ముందుగానే ఎగ్జామ్ డేట్లను ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా గత కొన్నేళ్లకు భిన్నంగా ఈసారి ప్రధాన సబ్జెక్టులకు ముందుగా పరీక్షలు నిర్వహించనుంది.

అయితే పది, 12వ తరగతలు పరీక్షా విధానంలో మార్పు లు, సిలబస్ తగ్గింపు గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బోర్డు ఖండించింది. ఆయా వార్తలన్నీ పుకార్లేనని.. వాటిని నమ్మవద్దని స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించింది.