2 July, 2026 | 4:09 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

కాగ్ అధిపతిగా తెలుగు వ్యక్తి

22-11-2024 12:31 AM

ప్రమాణం చేయించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ, నవంబర్ 21: భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) అధిపతిగా కే సంజయ్‌మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సంజయ్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారు.

తెలు గు వ్యక్తి అయిన సంజయ్ ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వచ్చే నెలలో ఆయన రిటైర్‌మెంట్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనను కాగ్ అధిపతిగా కేంద్రం నియమించింది.