చిన్న ముప్పారంలో సీసీ కెమెరాలు ఏర్పాటు
11-06-2026 12:46 AM
కేసముద్రం, జూన్ 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు కార్యక్రమాన్ని ఎస్ఐ కర్ణాకర్ ప్రారంభించారు. గ్రామ సర్పంచి రాయలి భవాని శేఖర్ ఆధ్వర్యంలో 8 సీసీ కెమెరాలు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లం ఐలయ్య, పిఎసిఎస్ చైర్మన్ గుండా వెంకన్న, మాజీ సర్పంచ్ దర్శనం బిక్షపతి, రాయలి గంగాధర్, వార్డు సభ్యులు తాడబోయిన లింగయ్య, కట్ల అనిల్, తాడబోయిన దేవేందర్, ఎల్లబోయిన పద్మ, కార్పోతుల రాకేష్, గ్రామస్తులు గుండు వేణు మల్లం రాములు కామినేని బాలరాజు నర్ర వీరన్న, రాజీరూ, రామ చంద్రు తదితరులు పాల్గొన్నారు.






