ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం
06-03-2026 09:32 PM
సిద్దిపేట రూరల్: గ్రామ అభివృద్ధికి మరో అడుగు పడింది. ఈజీఎస్ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ గ్యార పద్మ శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని సర్పంచ్ తెలిపారు.
వర్షాకాలంలో మట్టి, బురద సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఈ రోడ్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




