ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్
ప్రజల ప్రాణాలు సంరక్షించే బాధ్యత ప్రతి ఆరోగ్య సిబ్బంది చేపట్టాలి
ఎల్లారెడ్డి జూలై 2 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా డి,ఎంహెచ్ ఓ వెంకట్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు వైద్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని ఆసుపత్రి వైద్యులు శరత్ కుమార్ కు సూచించారు. ఆస్పత్రిలో ఆసుపత్రి సిబ్బంది సమయానికి హాజరు కాకపోవడం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని సిబ్బందిపై డిఎంహెచ్ ఓ మండిపడ్డారు. అనంతరం ఆసుపత్రిలోని మాత్రల పంపిణీ గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకి అందుతున్న సేవల పట్ల వాటి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ, నర్సింగ్ చౌహన్, మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






