25 July, 2026 | 2:35 AM

రూ.18.50 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభం

25-07-2026 01:57 AM

జవహర్‌నగర్, జూలై 24 (విజయక్రాంతి): కీసర సర్కిల్ (ఎంఎంసీ) నాలుగో డివిజన్ దమ్మాయీగూడ పరిధిలోని 7వ వార్డు జీవీఆర్ ఎన్క్లేవ్లో రూ.18.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. 213 మీటర్ల పొడవు, 4.2 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ రహదారి స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించనుంది.

ఈ కార్యక్రమంలో ముప్పా రామారావుతో పాటు శ్రీకాంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శోభారాణి, మెరుగు సునీత, యాదగిరి గౌడ్, శ్రావణ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, సుమేష్, జగన్, రాజేష్, గోవర్ధన్ రెడ్డి, ముప్పా శ్రీలత పాల్గొన్నారు.