25 July, 2026 | 3:11 AM

కార్మికులు, మహిళలకు చీరల పంపిణీ

25-07-2026 02:34 AM

అందజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్

ఘనంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు 

సికింద్రాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధి పట్ల కేటీఆర్ చూపుతున్న అంకితభావం యువతకు ఆదర్శమని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కొనియాడారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజును ప్రజాసేవా దినోత్సవంగా నిర్వహించాలని పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఓల్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి కార్మికులకు,ఓల్ బోయిన్పల్లి, హస్మత్పేట్ డివిజన్ల మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి పట్ల కేటీఆర్ చూపుతున్న అంకితభావం యువతకు ఆదర్శమని కొనియాడుతో ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు  కేటీఆర్ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నాం అని తెలియజేస్తూ సమాజానికి విశేష సేవలందిస్తున్న మున్సిపల్ మహిళా కార్మికుల కృషికి గుర్తింపుగా వారికి చీరలు అందించడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్ర మాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తాం అన్ని మాజీ కార్పొరేటర్ ముద్దం తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం సుమారుగా 15 ఏళ్ల నుంచి కెసిఆర్, కేటీఆర్, నా బర్తడే కు సందర్భంగా నిరుపేదలకు చీరల ఇచ్చిన గొప్ప నాయకుడు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొనియాడారు.సమాజానికి సేవ చేస్తున్న మున్సిపల్ మహిళా కార్మికుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ మహిళా కార్మికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.