మొండివర్రె గ్రామానికి తక్షణమే సీసీ రోడ్డు మంజూరు చేయాలి

12-09-2026 | 12:41pm

ములకలపల్లి,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మొండివర్రె గ్రామానికి తక్షణమే సీసీ రోడ్డు మంజూరు చేయాలని చౌవిటిగూడెం గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు సున్నం రాము డిమాండ్‌ చేశారు. శనివారం మండల పరిధిలోని చౌవిటిగూడెం గ్రామపంచాయతీ లోని మొండివర్రె గ్రామాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌవిటి గూడెం గ్రామ పంచాయతీలోని గ్రామాల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయని అన్నారు.గ్రామాల సమస్యలపై చౌవిటిగూడెం పాలక వర్గ సమావేశంలో అనేక మార్లు లేవనేత్తిన పరిష్కరించడం లేదని తెలిపారు.

మొండివర్రె గ్రామస్తులు గ్రామంలోని అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని మొండివర్రె గ్రామంలో చిన్న పాటి వర్షం కురిస్తే రహదారి పై మొత్తం బురదమయంగా మారి విద్యార్థులు,వృద్ధులు,స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.తక్షణమే మొండి వర్రె,రంగాపురం గ్రామాల్లో సీసీ రోడ్లు,డ్రైనేజీ కాలువలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

వీధిదీపాలు,గ్రామాల్లో శానిటేషన్ పనులు ప్రారంభించి గ్రామాల చుట్టూపక్కల గడ్డి మందు,దోమల నివారణకు వెంటనే పిచికారి చేయించాలని డిమాండ్ చేశారు.గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రత ను కాపాడాలన్నారు‌.మొండి వర్రె, రంగాపురం గ్రామాల్లో సీసీ రోడ్లు మంజూరు చేయకపోతే మొండి వర్రె,రంగాపురం గ్రామాల ప్రజలను పెద్దఎత్తున సమీకరించి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తాటి ముత్యాల రావు,సున్నం రాజులు,బోర్రా శ్రీను,నాగేంద్ర బాబు,కుర్సం పోతురాజు,తాటి రాజా,భారతి, నర్సమ్మ,సీతమ్మ, కుర్సం బాబు, శ్రీను,చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు