calender_icon.png 18 August, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌష్టికాహారాన్ని తీసుకోవాలి: సిడిపిఓ చందన

20-09-2024 09:34:45 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): విద్యార్థినిలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంచిర్యాల సిడిపిఓ చందన అన్నారు. పోషణ మాసంలో భాగంగా శుక్రవారం మంచిర్యాల కేజీబీవీ పాఠశాలలో కిశోర బాలికలకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను, వ్యక్తిగత పరిశుభ్రతతో చేకూరే మేలును విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. అనారోగ్యాలకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం విద్యార్థులతో పోషణ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న, సూపర్ వైజర్లు జ్యోతి, రమ, సతీష్, అంగన్వాడీ టీచర్లు మాధవి, షరీప్, స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.