11-02-2026 12:00:00 AM
మర్మం వరలక్ష్మీ దేవి, ఏటిఏ రాష్ట్ర మహిళా కార్యదర్శి
భద్రాచలం, ఫిబ్రవరి 10, (విజయక్రాంతి): మార్చి ఎనిమిదో తేదీన ఆదివాసి టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరిజన అభ్యుదయ భవన్లో జరిగే మహిళా దినోత్సవం జయప్రదం చేయాలని ఏటిఎ రాష్ట్ర కార్యదర్శి మర్మం వరలక్ష్మిదేవి కోరారు. భద్రాచలం ,రాజుపేట కాలనీ నందు ఎ టి ఎ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తోలెం సుజాత అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి మర్మం వరలక్ష్మీదేవి ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు.
ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మార్చి 8న , భద్రాచలం గిరిజన అభ్యుదయ భవనం నందు నిర్వహించే మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహిళాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, స్త్రీ అభివృద్ధే దేశ అభివృద్ధిగా నేడు సమాజం ఉందన్ని, ప్రతి రంగంలో పురుషులతో సమానంగా భాగస్వామ్యం ఉండాలని, మహిళలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోడి శ్రీదేవి, పూసం హిందులత, తెల్లం పుష్పవతి , పాయం ఐపార్వతి, సోయం రామలక్ష్మి, ఎట్టి సీతారామమ్మ,సంధ్య తదితరులు పాల్గొన్నారు.